నారి శక్తి అవార్డుని కైవసం చేసుకున్న తెలుగు మహిళ . ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన నారి శక్తి అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా అందజేస్తారు. వివిధ రంగాలలో విభిన్నతని చూపించిన స్త్రీలకు ఈ అవార్డుని అందజేస్తారు. ముఖ్యంగా మహిళల భద్రత ,రక్షణ , విద్య, మరియు ఆరోగ్యం మొదలైన వాటి కోసం గణనీయంగా పనిచేసిన స్త్రీ మూర్తులను పరిగణలోకి తీసుకుంటారు
విశాఖపట్టణానికి చెందిన శ్రీమతి సత్తుపాటి ప్రసన్న శ్రీ గారికి భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021 సంవత్సరాలకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. సత్తుపాటి ప్రసన్న శ్రీ గారు ఒక భారతీయ భాషావేత్త వీరు ఆంధ్రయూనివర్సిటీ లో ప్రొఫెసర్ & బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు మైనారిటీ గిరిజన భాషలను కాపాడేందుకు వీరు విశిష్టంగా కృషి చేసారు మరియు గిరిజన భాషల కోసం కొత్త రచనా వ్యవస్థలను అభివృద్ధి చేసారు . ప్రపంచంలోనే మొట్టమొదటగా 19 గిరిజన భాషల కోసం వర్ణమాలలు రూపొందించిందిన మహిళగా పేరు గడించారు , అందులో కొన్ని భగత, గదభ,కొలమి, కొండ దొర మొదలైన సాహిత్య రచనలు ఉన్నాయి. అంతరించిపోతున్న ప్రపంచ అట్లాస్‌లో కనిపించిన మొట్ట మొదటి భారతీయ మరియు ఆసియా మహిళగ ప్రసిద్ధి చెందారు. మైనారిటీ గిరిజన భాషల సంరక్షణ కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను నారీ శక్తి పురస్కారంప్రదానం చేయబడింది
నారి శక్తి పురస్కార్ అవార్డు:
*మొదటగా ఈ అవార్డులు 1999లో స్త్రీ శక్తి పురస్కారం పేరుతో ఇవ్వడం మ్మొదలైంది తర్వాత 2015లో నారి శక్తి పురస్కార్ అవార్డు గా పేరు మార్చబడింది
*మహిళలకి గౌరవ ప్రదంగా ఇచ్చే అతి పెద్ద అవార్డు ఇదే
*25 సంవత్సరాలు మరియు ఆపై వయసు ఉన్న అందరు మహిళలు ఈ పురస్కారానికి అర్హులే .
*ఈ అవార్డుకి ఎన్నికైన వారికి రెండు లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.
ఇంకా చదవండి
Share your comments