News

రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలను నిర్దేశిస్తూ 'Indian Agriculture towards 2030' పుస్తక ఆవిష్కరణ!

S Vinay
S Vinay

కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి (MoA&FW) శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ,నీతి ఆయోగ్ నిర్వహించిన కార్యక్రమంలో (2030 దిశగా భారతీయ వ్యవసాయం) 'Indian Agriculture towards 2030' అనే పుస్తకాన్ని విడుదల చేసారు.

రైతుల ఆదాయం, పోషకాహార భద్రత ,సుస్థిర ఆహారం మరియు వ్యవసాయ వ్యవస్థలను మెరుగుపరిచే మార్గాలని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని ప్రచురించారు.నీతి ఆయోగ్ మరియు ఫుడ్&అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. నీతి ఆయోగ్ మరియు FAO అధికారులను అభినందిస్తూ, కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇలా అన్నారు, “రైతులు,వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణుల సమిష్టి కృషితో భారతదేశ వ్యవసాయం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది అని పేర్కొన్నారు.
పుస్తక సంపాదకుల్లో ఒకరైన నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న విపరీతమైన సవాళ్లను పరిగణలోకి తీసుకొని ఫుడ్&అగ్రికల్చర్ ఆర్గనైజేషన్,వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ సమిష్టిగా వీటి పై దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు.

(2030 దిశగా భారతీయ వ్యవసాయం) 'Indian Agriculture towards 2030' పుస్తక ముఖ్యంశాలు.

భారతీయ వ్యవసాయాన్ని మార్చడం
నిర్మాణాత్మక సంస్కరణలు
ఆహార వైవిధ్యం, పోషకాహారం మరియు ఆహార భద్రత
వ్యవసాయంలో వాతావరణ ప్రమాదాలను నిర్వహించడం
సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్
భారతదేశంలో నీరు మరియు వ్యవసాయ పరివర్తన యొక్క సహజీవనం
తెగుళ్లు, వ్యాధులు , సంసిద్ధత మరియు జీవ భద్రత
స్థిరమైన మరియు జీవవైవిధ్య భవిష్యత్తు కోసం వ్యవసాయ-ఆధారిత ప్రత్యామ్నాయాలు

నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) గురించి తెలుసుకుందాం:
నీతి ఆయోగ్ జనవరి 1, 2015న మొదలైంది ఇది అంతకు ముందు ఉన్న planning commission ని బదులుగా ఏర్పడింది.

నీతి ఆయోగ్ లక్ష్యాలు
గ్రామ స్థాయిలో విశ్వసనీయమైన ప్రణాళికలను రూపొందించడానికి మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలలో క్రమంగా వీటిని సమగ్రపరచడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం.
ఆర్థిక పురోగతి పొందని విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం.
నిరంతర ప్రాతిపదికన రాష్ట్రాలతో నిర్మాణాత్మక మద్దతు కార్యక్రమాలు మరియు యంత్రాంగాల ద్వారా సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడం, బలమైన రాష్ట్రాలు బలమైన దేశంగా మారుతాయని గుర్తించడం.
జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు మరియు ఇతర భాగస్వాములతో కూడిన సహకార సంఘం ద్వారా స్థిరమైన స్థాపించడం.

మరిన్ని చదవండి.

తెలంగాణ :ఖమ్మం మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు ధర!

Share your comments

Subscribe Magazine

More on News

More