2023-24 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం కనీస మద్దతు ధరలను 7 నుంచి 10 శాతానికి పెంచుతూ సర్క్యూలర్ ను జారీ చేసింది .అయితే పెరిగిన ధరలు కేవలం అంతంత మాత్రంగా ఉండడంతో ఇటు రైతుల నుంచి ప్రతి పక్షాలనుంచీ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై నిన్న లూథియానా లో BKU (భారతీయ కిసాన్ యూనియన్ ) ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కనీస మద్దతు ధరల పెంపు అనేది "పెద్ద జోక్' అని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం 4 నుంచి 10 శాతం పెంచితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పంటగా వరి సాగు చేస్తారు అయితే 2022-23 సంవత్సరం వరి కి కనీస మద్దతు ధర రూ . 2060 గ ఉండేది ఇప్పుడు 2023-24 సంవత్సరానికి పెరిగిన ధరతో రూ.2183 కు చేరింది అయితే పెరిగింది మాత్రం కేవలం రూ . 123 మాత్రమే దీనితో సమస్యలన్నీ తీరిపోతాయా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఉపయోగపడే వివిధ వ్యవసాయ భీమాలు మరియు వాటి ప్రయోజనాలు...
"గతంలో కంటే ధరలు అన్ని పెరిగిపోయాయి , విత్తనాల దగ్గరనుంచి కూలీలా ఖర్చు వరకు అన్ని పెరిగిపోయాయి.2023-24 సంవత్సరానికి అయినా భారీగా కనీస మద్దతు ధర పెరుగుతుందని ఆశించ 5 ఎకరాలలో పంట పండిస్తే అన్ని ఖర్చులు పోను మిగిలింది ఏమిలేదు " అని సూర్యాపేట జిల్లాకు చెందిన వంగల శ్రీనివారెడ్డి అనే రైతు అని ఆవేదన వ్యక్తం చేసారు .
పెరిగిన ధర మధ్య వ్యత్యాసం :
SL.No |
పంట |
2022-23 ధర |
2023-24 ధర |
పెరిగింది |
1 |
వరి |
2060 |
2183 |
123 |
2 |
పత్తి
|
6380 |
6620 |
240 |
3 |
జొన్న |
2990 |
3180 |
190 |
4 |
మొక్క జొన్న |
1962 |
2090 |
128 |
5 |
కందులు |
6600 |
7000 |
400 |
6 |
పెసర |
7755 |
8558 |
803 |
7 |
మినుములు |
6600 |
6950 |
350 |
Share your comments