గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి అవకాశాలను కల్పించడం కోసం అప్పటి UPA ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టింది , గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగతను తొలగించి కచ్చితమైనా ఇంటికి కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం .
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు చెల్లిస్తున్న వేతనాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపు తర్వాత హర్యానాలో రోజువారీ వేతనం అత్యధికంగా రూ.357 మరియు మధ్యప్రదేశ్ & చత్తీస్‌గఢ్‌లలో అత్యల్పంగా రూ.221కి చేరింది. అయితే ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది.
వేతనాల మార్పుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), 2005 సెక్షన్ 6 (1) ప్రకారం దీనిని జారీ చేసింది. ఆయా రాష్ట్రాలను బట్టి రూ.7 నుంచి రూ.26 వరకు పెంపు వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
రానున్న 5 రోజులు AP, తెలంగాణాలో వర్షాలు !
ఇతర రాష్ట్రాలలో రోజు వారి వేతనం పెరుగుదల 5 శాతం నుంచి 10 శాతం మధ్య ఉండనున్నట్లు వెల్లడించింది అయితే ఇప్పటికే తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లో సగటు వేతనం రూ . 257 ఉంది అయితే నోటిఫికేషన్ ను బట్టి రూ.7 నుంచి రూ.26 వరకు పెంపు వర్తిస్తుంది దీనితో సగటు వేతనం 2023-24 కు 280 రూపాయల వరకు లభించే అవకాశం వుంది .
Share your comments