మండుస్ తుఫాను తరువాత బంగాళాఖాతం లో ఏర్పడిన తూఫాను కారణముగా రానున్న 3 రోజులలో రాష్ట్ర వ్యాప్తముగా తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది
దక్షిణ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రంలో నెలకొన్న అల్పపీడనం పశ్చిమ దిశగా విస్తరిస్తుందని రానున్న మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా కొనసాగి శ్రీలంక వైపు పయనించే అవకాశం ఉందని అల్పపీడన ప్రభావంతో మంగళవారం (డిసెంబర్ 20) నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది .
రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త :10 కిలోల ఉచిత బియ్యం పంపిణి పొడిచే అవకాశం !
అదేవిధముగా ఆంధ్రప్రదేశ్ పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే చాన్స్ ఉందని చెప్పింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం కొనసాగుతోంది. ఆదివారం కడపలో 18.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక తెలంగాణాలో కూడా చలి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
Share your comments