News

ఆధార్ కార్డుఅప్డేట్ గడువు పొడగింపు..

Srikanth B
Srikanth B
ఆధార్ కార్డుఅప్డేట్ గడువు పొడగింపు..
ఆధార్ కార్డుఅప్డేట్ గడువు పొడగింపు..

ఆధార్ కార్డుఅప్డేట్ గడువు పొడిగింపు. 10 ఏళ్ల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డులను జూన్ 14 వరకు ఉచితంగా రెన్యూవల్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో ప్రకటించింది. అయితే ఈ గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఫోటో , చిరునామా తదితర ఏ సమాచారాన్ని ఇప్పటి వరకు అప్ డేట్ చేసుకోని వారు సెప్టెంబర్ వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది.

ఆధార్ కార్డు సమాచారాన్ని ఎలా అప్‌డేట్ చేయాలి?

1. ముందుగా https://uidai.gov.in/ పోర్టల్‌ని సందర్శించండి.

2. myAadhaar ఎంపికపై క్లిక్ చేయండి.

3. ఆధార్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.

4. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ధృవీకరించండి.

5. పేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నవీకరించవచ్చు.


6. ధ్రువ పాత్రల కాపీలను అప్‌లోడ్ చేయాలి.

7. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

8. సేవా అభ్యర్థన సంఖ్య పొందబడుతుంది. స్థితిని తనిఖీ చేద్దాం.

9. మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది

వాతావరణ హెచ్చరిక: "బైపోర్‌జోయ్" తుఫాను ప్రభావం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..


భారతదేశంలో ఆధార్ కార్డు ప్రధాన గుర్తింపు పత్రం . వివిధ ప్రయోజనాలు మరియు ప్రయోజనాల కోసం ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అయితే మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయగలరు. మీ సేవ కేంద్రాలు లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్డేట్ చేసేవారు రూ.50 చెల్లించాలి. సాంకేతిక సమస్యల కారణంగా, చాలా మందికి రెన్యూవల్ చేసుకునే అవకాశం రాలేదు. దీనితో గడువును పొడిగించింది ప్రభుత్వం .


అలాగే, ఆధార్ మరియు పాన్ కార్డ్‌లను లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత పాన్ కార్డు పనిచేయదు అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in ద్వారా పాన్ మరియు ఆధార్ లింక్ చేయాలి. పాన్ కార్డులను ఆలస్యంగా లింక్ చేస్తే రూ.1,000 జరిమానా విధించబడుతుంది.

వాతావరణ హెచ్చరిక: "బైపోర్‌జోయ్" తుఫాను ప్రభావం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Related Topics

aadhar update

Share your comments

Subscribe Magazine

More on News

More