వ్యవసాయం రంగంలో నూతన సాంకేతికత మరియు ఉత్తమ యాజమాన్య సాగు పద్దతులను వ్యవసాయ క్షేత్రంలో అమలు పరిచే ఉద్దేశం తో ప్రతి జిల్లాలో KRISH VIGNAN KENDRA (KVK )ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
భారత దేశంలో మొదటి కృషి విజ్ఞాన కేంద్రం 1974 వ సంవత్సరంన పాండిచ్చేరి లో స్థాపించబడింది. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండగా తెలంగాణ లో 16 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి.దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 81 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి.
కృషి విజ్ఞాన కేంద్రాలు ఉత్పత్తి చేసిన నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు మంచి స్థాయిలో ఉన్నాయి. గత మూడేళ్లలో సుమారుగా 5.48 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 1150.53 లక్షల మొక్కలను , 2.74 లక్షల క్వింటాళ్ల బయో ఉత్పత్తులు, మరియు 680.79 లక్షల పశువుల జాతులు మరియు చేపలును కృషి విజ్ఞాన కేంద్రం అభివృద్ధి చేసింది.
కృషి విజ్ఞాన కేంద్ర కార్యకలాపాలలో వ్యవసాయ సాంకేతికతలను అంచనా వేయడం మరియు రైతులకి సాంకేతికత చేరేలా ప్రదర్శన చేయడం; రైతులు మరియు విస్తరణ సిబ్బందికి శిక్షణ; రైతులకు వ్యవసాయంలో వినూత్నమైన సలహాలను అందించడం; మరియు రైతులలో మెరుగైన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటివి చేస్తుంది.
అయితే కృషి విజ్ఞాన కేంద్ర సేవలు, రైతులకి మరింత చేరువ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది దీని కొరకై ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
మరిన్ని చదవండి.
Share your comments