రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కలిసి పోటీ చేయడం అనేది మా ఇద్దరి భవిష్యత్తు కోసం ఐతే కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం వ్యక్తిగతంగా ఏ పార్టీకి ప్రయోజనం చేకుర్చదని, భవిష్యత్తు రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో గొప్ప ప్రయోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మన రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వైసీపీని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే కూటమి ఏర్పాటు ఆవశ్యకతను పవన్ కళ్యాణ్ చెప్పారు. తమ మధ్య ఈ ములాఖత్ చాలా కీలకం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీలు కలసికట్టుగా పాల్గొంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని పోటీ చేస్తాం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వకుండా ఉండడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలని పవన్ కళ్యాణ్ తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాం ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..
కేంద్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్.. కొత్తగా 75 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లకు కేబినెట్ ఆమోదం
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన-టీడీపీ కూటమి పోటీకి సిద్ధంగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంలో బీజేపీ కలిసి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం వద్ద తాను ఈ పొత్తుల అంశాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర నాయకత్వానికి బాగా తెలుసునని పవన్ కల్యాణ్ అన్నారు.
రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుంది అనేది ప్రధాని నరేంద్రమోడీకి తెలుసునని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో బీజేపీ అధిష్టానం తమ పొత్తుకు సహకరిస్తుంది అని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ అరాచకాలను, దోపిడీని విడివిడిగా ఎదుర్కోవడం సరిపోదని, అందుకే టీడీపీ, బీజేపీ, జనసేనతో కలసి పోరాడడమే తమకు మేలు అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఐక్యంగా లేకుంటే మరో రెండు దశాబ్దాల పాటు ఇదే అరాచక స్థితి కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..
Share your comments