జల్ జీవన్ మిషన్ (జేజేఎం) మరో మైలురాయిని అధిగమించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్న సమయంలో జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న 10 కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయడం ప్రారంభించింది. జల్ జీవన్ పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న ప్రారంభించారు. పథకం ప్రారంభమయ్యే సమయానికి దేశంలో 3.23 కోట్ల గ్రామీణ గృహాలు మాత్రమే పైపుల ద్వారా మంచి నీరు పొందుతున్నాయి. 2022 ఆగస్టు 19 వ తేదీ నాటికి కుళాయి కనెక్షన్ కలిగి ఉన్న గ్రామీణ గృహాల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది.
తాజా సమాచారం ప్రకారం మూడు రాష్ట్రాలు ( గోవా, తెలంగాణ, హర్యానా) మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ( పుదుచ్చేరి, డామన్ డయ్యు,దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ప్ర్రావులు) తమ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా పైపుల ద్వారా మంచి నీరు సరఫరా చేస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో 99.93% గృహాలు, గుజరాత్ రాష్ట్రంలో 97.03%, బీహార్ లో 95.51% హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 94.88% గ్రామీణ గృహాలు కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు పొందుతున్నాయి. త్వరలో ఈ రాష్ట్రాలలో కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా అవుతుంది. 2022 ఆగస్టు 17వ తేదీన గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు లు " హర్ ఘర్ జల్" సర్టిఫికెట్ పొందిన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు గ్రామ సభల ద్వారా అవసరాల మేరకు సురక్షిత మంచి నీటిని పొందుతున్నాయి.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా దేశంలో 8.67 లక్షల (84.35%) పాఠశాలలు మరియు 8.96 లక్షల (80.34%) అంగన్‌వాడీ కేంద్రాలకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. దేశంలో 117 ఆకాంక్షాత్మక జిల్లాల్లో మిషన్ ప్రారంభించిన సమయానికి, కేవలం 24.32 లక్షల (7.57%) కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది. ఈ సంఖ్య ఇప్పుడు 1.54 కోట్లకు (48.00%) పెరిగింది. తెలంగాణలో మూడు ఆకాంక్షాత్మక జిల్లాలు (కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి మరియు భద్రాద్రి కొత్తగూడెం) మరియు పంజాబ్ (మోగా), హర్యానా (మేవాట్) మరియు హిమాచల్ ప్రదేశ్ (చంబా)లో 100% నీటి సరఫరా కుళాయిల ద్వారా జరుగుతోంది.
Share your comments