
తెలంగాణాలో ఇక రైతు భరోసా ఆగిపోనుందా? ప్రస్తుతం పరిస్థితులని చూస్తే చాలామంది రైతులకి ఈ అనుమానాలు రావచ్చు. గత 15 రోజులుగా ఎంతో మంది రైతులకి వారి అకౌంట్ లో ఎటువంటి పెట్టుబడి సాయం అందక పోవడం తో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకి ఆర్ధిక సాయం అందింది. కానీ అంత కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులకి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. అయితే రైతులు ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. కేవలం కొన్ని టెక్నీకల్ వల్ల మాత్రమే ,ఇలా జరుగుతుందని అధికారులు అంటున్నారు.
- ఇది మాత్రమే కాకుండా 3 ఎకరాలకంటే ఎక్కువ భూమి ఉన్న గాని రైతు భరోసా అందుతుందని కానీ మార్చ్ 31 దాకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
- తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జనవరి 26, 2025న తెలంగాణ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద, మెరుగైన విత్తనాలు, ఎరువులు మరియు నీటిపారుదలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అర్హతగల రైతులకు ఏటా ఎకరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పటిదాకా నాలుగు విడతల్లో రైతు భరోసాని మూడు లేదా అంతకంటే తక్కువ ఎకరాలు ఉన్న వ్యవసాయదారులకు మాత్రమే పెట్టుబడి సాయం కింద వర్తింపజేసింది. ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా ఈ సాయం అందబోతోంది. మరో వారం లో 4 ఎకరాలు ఉన్న రైతులకు, మార్చి 31లోగా 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అమలు చేసేటందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు.
- ఈ పథకం ప్రకారం ఎకరానికి 6 వేల రూపాయిలు రైతుల ఖాతాలో పడతాయి. కానీ సాగు చెయ్యటానికి పనికిరాని 1.20 లక్షల సర్వే నంబర్లని అంటే 3 లక్షల ఎకరాల భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. రాష్ట్రంలో మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో వ్యవసాయానికి అనువుగా లేని 3 లక్షల ఎకరాల భూమిని తీసేస్తే, మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఎకరాల రైతులకి కూడా డబ్బు ఇస్తే అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భరోసా నిధులు ఇచ్చేనట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు నిధులు జమయ్యాయి. మొత్తం 58.13 లక్షల ఎకరాల సాగుకు రూ. 3,487.82 కోట్ల నిధులు విడుదల చెయ్యడం జరిగింది. జనవరి 26న పైలెట్ ప్రాజెక్టు గా రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులుప్రతి మండలంలో ఒక గ్రామానికి కేటాయించి ఈ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రైతు భరోసా నాలుగు విడతలుగా అమలు అయ్యింది.
తెలంగాణ రైతు భరోసా పథకం కింద, అర్హత కలిగిన రైతులు ఎకరానికి సీజన్‌కు ₹6,000, రబీ మరియు ఖరీఫ్ పంట సీజన్లలో సంవత్సరానికి ₹12,000 అందుకుంటారు.
- తెలంగాణ లో రైతు భరోసా స్టేటస్ ని ఒకవేళ ఆన్‌లైన్‌లో చూసుకోవాలి అనుకుంటే, ఈ క్రింది విధానాన్ని అనుసరించండి:
-
- Rythubharosa,telangana.in అనే అధికారిక వెబ్ సైట్ ని ముందుగా ఓపెన్ చేయాలి . ఆ తరువాత వెబ్సైట్ పై మూలలో కుడి వైపున ఉన్న లాగిన్ అని రాసి ఉన్న దగ్గర క్లిక్ చెయ్యాలి. అక్కడ మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ,అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ వగైరా, నింపాలి. దాని తర్వాతా వచ్చే ఓటిపి తో వెరిఫై చేయాలి.
- ఇదంతా అయినాక ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో పేమెంట్ స్టేటస్ లేదా బెనిఫిషరీ లిస్ట్ సెక్షన్ ని ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ని అక్కడ నింపి ఆతరువాత, డబ్బులు పడ్డాయా లేదా, లేదా మీ దరకాస్తు స్థితి ని, పేమెంట్ స్టేటస్ ను చూసుకోవచ్చు.
Share your comments