ఇండియన్ రైల్వేస్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 238 పోస్టులను భర్తీ చేయనున్నారు .
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి RRB ALP పరీక్షను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ కథనంలో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు .
ఏప్రిల్ 07 నుండి పోస్టులకు ధరకాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఆన్లైన్ విధానం లో ధరాకాస్థులు పెట్టుకోవాల్సి ఉంది. మే 6వ తేది వరకు ధరకాస్తులు స్వీకరించడం జరుగుతుంది.
పోస్టుల వ్వకెన్సీ వివరాలు :
పోస్ట్ వర్గం - ఖాళీ
UR - 120
SC - 36
ST - 18
OBC - 64
మొత్తం - 238
ఇది కుడా చదవండి ..
సెప్టెంబర్ నుండి రాజధానిగా విశాఖ..? సీఎం సంచలన ప్రకటన
అభ్యర్థుల అర్హత వివరాలు : అబ్దరకాస్తు చేసే అభ్యర్థి యొక్క వయసు 15 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి,అభ్యర్థి పదవ తరగతి తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉతీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ రాత పరీక్ష , సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ RRB ALP పోస్ట్ 2023కి సంబంధించిన పరీక్ష, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలు అన్నీ ఆఫిషల్ వెబ్సైటు
https://rrcjaipur.in/ ను సందర్శించవచ్చు.
ఇది కుడా చదవండి ..
Share your comments