News

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2 పథకాలను అమలు చేస్తోంది!

Srikanth B
Srikanth B

ఈ రెండు పథకాలు పరంపరగత్ కృషి వికాస్ యోజన (పికెవివై), మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్ మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (MOVCDNER).ఈ రెండు పథకాలు సేంద్రియ రైతులకు మద్దతు అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి చెప్పారు

ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్, సర్టిఫికేషన్ మరియు మార్కెటింగ్ వరకు,  కోత అనంతర తీసుకోవాల్సిన చర్యల వరకు, ఇది సేంద్రీయ ఉత్పత్తుల ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.

PKVY  పథకం   కింద రైతులకు హెక్టారుకు రూ.50,000 చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఇందులో మూడేళ్లకు హెక్టారుకు రూ.31,000 నేరుగా డీబీటీ ద్వారా రైతులకు ఆన్-ఫామ్, ఆఫ్-ఫామ్ సేంద్రియ ఇన్పుట్ల కోసం అందజేస్తున్నామని ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు.

(MOVCDNER) పథకం కింద ఎఫ్పీవోల ఏర్పాటుకు, సేంద్రియ ఇన్ పుట్స్, నాణ్యమైన విత్తనాలు, నాటే సామగ్రి, శిక్షణ, హ్యాండ్ హోల్డింగ్, సర్టిఫికేషన్ కోసం రైతులకు మద్దతు, ఎఫ్ పీవోల ఏర్పాటుకు మూడేళ్లపాటు హెక్టారుకు రూ.46,575 చొప్పున అందిస్తారు.

 

 కోత అనంతర మౌలిక సదుపాయాలకు, ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్కు గరిష్టంగా రూ.600 లక్షలు, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్కు రూ.37.50 లక్షలు, రిఫ్రిజిరేటెడ్ వెహికల్, కోల్డ్ స్టోర్  రూ.18.75 లక్షలు, కలెక్షన్,  వరకు సహాయాన్ని అందిస్తున్నట్లు చౌదరి తెలిపారు.

Minimum Supporting Price: కనీస మద్దతు ధర కోసం కమిటీని ఏర్పాటు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం : నరేంద్ర సింగ్ తోమర్! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More