భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మరియు దేశంలో దాదాపు 70 శాతం జనాభా వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధిత రంగాలపై ఆధార పడి ఉన్నారు , భారతదేశానికి వ్యవసాయం వెన్నుముకవంటిది అదేక్రమంలో రైతులకు మరియు వ్యవసాయ రంగ నిపుణులకు మధ్య ఉన్న ఖాళీని పూరించి , రైతులకు అధునాతన వ్యవసాయ సమాచారం అందించాలనే ఉద్దేశంతో 1996 సెప్టెంబర్ 5 న ఎం.సి డొమినిక్ వ్యవసాయ మ్యాగజైన్ (Magazine ) కృషి జాగరణ్, ఆంగ్లం లో అగ్రికల్చర్ వరల్డ్ ను స్థాపించారు . నేటితో 26 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భం గ కృషి జాగరణ్ ఫౌండర్ అండ్ ఎడిటర్ చీఫ్ ఎం.సి డొమినిక్ ,డైరెక్టర్ షైనీ డొమినిక్ , కృషి జాగరణ్ టీం రైతులతో కలసి దృశ్య మాధ్యమం లో 26 వ వార్షికోత్సవాలను నిర్వహించారు .
ఈ 26 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ప్రత్యేకతలను, మైలురాయిలను కృషి జాగరణ్ అధిగమించింది. 12 భాషలు తెలుగు ,తమిళం ,కన్నడ , మలయాళం , అస్సామీ ,గుజరాతి ,పంజాబీ ,బెంగాలీ ,ఒడియా ,మరాఠీ ,హిందీ ,ఇంగ్లీష్ లో ప్రచురితం అయ్యే ఏకైక భారతీయ వ్యవసాయ మ్యాగజైన్ గ "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు " సాధించింది అదేవిధం గ 12 భాషలలో డిజిటల్ మాధ్యమంలో రైతుల కోసం వెబ్సైటు కలిగివున్న ఏకైక అగ్రిమీడియా పేరుగాంచింది , రైతుల సమస్యలను వినిపించడానికి రైతుల గొంతుకగా FTJ ఫార్మర్ ది జర్నలిస్ట్ నుం స్థాపించింది మరియు అగ్రి జర్నలిస్టు లను ఒకే తాటిపై తీసుకురావడానికి AJAI (అగ్రికల్చర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఇండియా ) ను స్థాపించింది .
26 సంవత్సరాల లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటు భారతదేశంలోనే అగ్రగామి వ్యవసాయ రంగ మీడియా "కృషి జాగరణ్ " అవతరించింది . 26 వార్షికోత్సవం సందర్భముగ కృషి జాగరణ్ ఫౌండర్ అండ్ ఎడిటర్ చీఫ్ ఎం.సి డొమినిక్ మాట్లాడుతూ ప్రతి రైతు గడపకు "కృషి జాగరణ్ మ్యాగజిన్ చేరాలనే సంకల్పంతో స్థాపించబడిన కృషి జాగరణ్ ఇప్పడు దేశవ్యాప్తంగా 180 మిలియన్ విజిటర్ ను సాధించిందని వెల్లడించారు .
Share your comments