రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులు వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ ఖచ్చితంగా అవసరం అనే విషయం తెలిసిందే. అయితే ట్రాక్టర్‌కు డీజిల్ ఖర్చు చాలా అవుతుంది. రైతులకు ఇది చాలా భారం అవుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. డీజిల్ నుండి సీఎన్‌జీగా మార్చబడిన ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. తాజాగా కేంద్ర మంత్రి నితిశ్ గడ్కరీ భారతదేశపు మొట్టమొదటి సీఎన్‌జీ ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు.
దీని వల్ల ఇక డీజిల్ ఖర్చు ఉండదు. ఈ ట్రాక్టర్ వల్ల రైతులకు సంవత్సరానికి రూ.లక్షా 50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదా అవుతుందని కేంద్రం తెలిపింది. ట్రాక్టర్లపై సీఎన్‌సీ కిట్‌ల కోసం దేశంలోనే ప్రతి జిల్లాలో రెట్రో ఫిట్‌మెంట్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
రామాట్ టెక్నో సొల్యూషన్స్ అండ్ తోమాసెట్టో అచిల్లె ఇండియా సంయుక్తంగా ఈ సీఎన్‌జీ ఇంధనంతో నడిచే ట్రాక్టర్లను రూపొందించాయి. రైతుల నిర్వమణ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ చాలా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదని కేంద్రం పేర్కొంది.
Share your comments