
ఇప్పటి వరకు బెంగుళూరులో ట్రాఫిక్ మాత్రమే అతి పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కాలంలో ఎక్కువవుతున్న నీటి సమస్యలు ప్రజల కంట క'న్నీటి'ని తెప్పిస్తున్నాయి. నిత్యవసరాలకు నీరు దొరక్క జనం కన్నీరు మున్నీరు అవుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
భారత ఐటీ హబ్ గా పేరొందిన బెంగుళూరు, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయం. ఎంతో మంది యువత భారత దేశం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల్లో స్థిరపడతారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని అధిక శాతం యువత ఇక్కడ కొలువుల్లో రాణిస్తున్నారు. ఎప్పుడు ఉరుకులు పరుగులతో ఉండే బెంగుళూరు నగరం, ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇప్పుడు నీటి సమస్యలను కూడా ఎదురుకుంటుంది. సుమారు 1.50 కోట్ల మంది జనాభా నివాసం ఉంటున్న ఈ నగరంలో ప్రతి రోజు రెండు బిలియన్ లీటర్ల నీటి వాడకం జరుగుతుంది. బెంగుళూరు ప్రజలు తమ నీటి అవసరాల కోసం ఎక్కువుగా భూగర్భ జలాల పై ఆధారపడుతున్నారు. కానీ భారీగా తగ్గిన భూగర్భ జలాల లభ్యత, బెంగుళూరు వాసుల నీటి కష్టానికి కారణమయ్యింది.

భూగర్భ జలాల్లో తగ్గుదల:
బెంగుళూరు చల్లటి వాతావరణానికి ప్రాముఖ్యం పొందింది. మిగిలిన ప్రధాన పట్టణాలతో పోల్చుకుంటే, బెంగుళూరులో వర్షపాతం కూడా ఎక్కువ. ఒకపుడు ఈ వర్షపు నీటిని, బెంగుళూరు అంత ఉన్న ఎన్నో చెరువుల్లో నిల్వ చేసేవారు. చెరువులు ఎక్కువుగా ఉండటం మూలాన భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండేవి. ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు ఈ చెరువులు అన్ని పెద్ద అపార్ట్మెంట్లగాను, పార్కుల గాను దర్శనమిస్తున్నాయి. చెరువులను పూడ్చి రెసిడెంట్యిల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. తద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకెందుకు వీలులేక, భూగర్భ జలాల శాతం తగ్గుతూ వస్తూ నీటి కొరతకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి
నీటి సమస్యలతో "కన్నీరు" పెడుతున్న బెంగుళూరు....
ఉద్యోగస్తుల యాతన:
నీటి కొరత కారణంగా, ఐటీ మరియు ఇతర ఉద్యోగులు అనేక కష్టాలను ఎదురుకుంటున్నారు. పీజీ లు, అపార్ట్మెంట్లలో నీరు లేక, తమ నిత్యవసరాల కోసం ఆఫీసులు మాల్స్ కు పరుగులు తీస్తున్నారు. చాల మంది ఉద్యోగులు, కాలకృత్యాలు ఆఫీసుల్లోనే కానిస్తున్నారు. పెరుగుతున్న నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, బెంగుళూరులోని చాల ఆఫీసులు ఇప్పటికే వర్క్ ఫ్రొం హోమ్ ప్రకటించాయి. నీటి సమస్యలు భరించలేక చాలామంది తమ సొంతూళ్ల బాట పడుతున్నారు
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బెంగుళూరు వాసుల నీటి కష్టాలను తీర్చేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి సమస్యలు తలెత్తకుండ వర్షపు నీటిని నిల్వ చేసందుకు చర్యలు చేపట్టాలి. అపార్ట్మెంట్లు, మరియు రెసిడెన్షియల్ ఏరియాలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని వృధాగా పోకుండా భూమిలోకి పంపించాలి. కాళీ ప్రదేశాల్లోని చెరువులను తవ్వడం ద్వారా మళ్ళి భూగర్భజలాలు పెంచవచ్చు. ప్రజలు కూడా విచక్షణతో నీటిని తమకు అవసరమైనంత మేరకే వాడుకుంటూ నీటి వృథాను తగ్గించాలి.
Share your comments