తెలుగు రాష్ట్రాల రైతులను ఇప్పటికే అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి , గత కొద్దీ రోజుల క్రితం కురిసిన వర్షలకు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో పొంచి వున్నా మరో తూఫాను రైతులను కలవరానికి గురిచేస్తుంది .
ఈ తూఫాను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ,మయన్మార్ తీరాల వైపు ప్రయాణిస్తుంది అయితే దిశా మార్చు కునే అవకాశం ఉందని , మోచా తుపాను దిశ మార్చుకుంటే కోస్తాంధ్ర వైపు కూడా ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా తీరా ప్రాంతాలను తాకే క్రమంలో దీనిప్రభావం తెలంగాణ రాష్ట్రపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది .
అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలుల తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది . గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది .
ఇది కూడా చదవండి .
అకాల వర్షాలతో అల్లాడుతున్న మిర్చి రైతులు.. భారీ నష్టాలు
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది ఇది క్రమేపి బలపడి వాయుగుండంగ మారె అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు మోచా అని భారత వాతావరణశాఖ నామకరణం చేసింది.
వర్షం ముప్పు పొంచి ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని , ఐకెపి సెంటర్లలో ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు .
Share your comments