కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం వారి ఖాతాలో ఆరువేల రూపాయలను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం ద్వారా 8 విడుదల డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డాయి. తొమ్మిదవ విడత డబ్బులు ఆగస్టు 9న ప్రధానమంత్రి విడుదల చేశారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధి యోజన పథకం కింద రెండు వేల రూపాయలు జమ అయ్యాయి.
ఈ క్రమంలోనే కొంత మంది రైతులకు పీఎం కిసాన్ 9 వ విడత డబ్బులు ఇంతవరకు వారి ఖాతాలో జమకాలేదు. ఎవరికైతే రెండు వేల రూపాయలు జమ కాలేదు అలాంటి వారు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ డబ్బులు పడని వారు కేవలం ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో రెండు వేల రూపాయలను పొందవచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి మీ ఖాతాకు డబ్బులు జమ చేయబడుతుంది. అయితే ఆ డబ్బులు మీ అకౌంట్లో జమ కావు.
ఈ విధంగా అకౌంట్ లో డబ్బులు జమ కాకపోవడానికి పలు కారణాలు ఉండవచ్చు. ఒకవేళ అ మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటివాటిలో ఏమైనా తప్పుగా ఉంటే ఈ విధంగా డబ్బులు మన అకౌంట్లో జమ కావు. ఈ విధమైనటువంటి సమస్య ఉండే వారు ముందుగా మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ సమస్యను వివరించాలి. ఒకవేళ అధికారులు మీ సమస్యకు ఎలాంటి స్పందన తెలియ చేయకపోతే ఈ క్రింది హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి మన అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చు.నంబర్ 011 24300606 /011 23381092 కు కాల్ చేయవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం PM కిసాన్ హెల్ప్ డెస్క్ pmkisan ict@gov.in మెయిల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు.
Share your comments