News

హిమాచల్‌లో పెద్ద ఎత్తున చనిపోతున్న ఇటాలియన్ తేనెటీగలు!ఆపిల్ ఉత్పాదన పై ఎలాంటి ప్రభావం చూపనుంది?

KJ Staff
KJ Staff
Himachal is loosing italian honeybees what could be the effect of it on apples
Himachal is loosing italian honeybees what could be the effect of it on apples

హిమాచల్ ప్రదేశ్‌లో 200,000 మంది రైతులు /తోటమాలులు యాపిల్స్ మరియు ఇతర పండ్ల చెట్లను పెంచుతున్నారు. వీరి జీవనాధారం పూర్తిగా ఉద్యానవనంపైనే ఆధారపడి ఉంది. యాపిల్ వ్యాపారం ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.4,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది.

వాతావరణ మార్పుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఇటాలియన్ తేనెటీగలు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరిగింది
హిమాచల్‌లో అనూహ్య వర్షాలు, మంచు కురువడంతో పాటు యాపిల్ సాగుకు తోడ్పడే ఇటాలియన్ తేనెటీగలు చనిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆపిల్ పెంపకందారులు ఏప్రిల్‌లో తమ పంటలను పరాగసంపర్కం చేయడానికి అపియారిస్ట్‌ల నుండి ఇటాలియన్ తేనెటీగలను తీసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఊహించని రుతుపవనాలు మరియు హిమపాతం యాపిల్ రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది.

అనూహ్య వాతావరణ పరిస్థితులు ఆపిల్ మరియు ఇతర ముఖ్యమైన పండ్ల పంటలను నాశనం చేసాయి. అలాగే పరాగసంపర్కానికి ఉపయోగించే ఈ ఇటాలియన్ తేనెటీగలు లేకపోవడం వాళ్ళ భారీ నష్టం వాటిల్లింది

ఇది కూడా చదవండి

రైతన్నలకు శుభవార్త: తడిచిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ..

సిమ్లా, కిన్నౌర్, లాహౌల్ స్పితి, కులు జిల్లాల్లో అత్యధికంగా తేనెటీగలు చనిపోయాయని రైతులు తెలిపారు. తేనెటీగల విధ్వంసం మరియు తేనెటీగల నష్టానికి గల కారణాలను అంచనా వేయడానికి రాష్ట్ర ఉద్యానవన శాఖ సిబ్బందిని విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో తేనెటీగలు చనిపోవడం, వాతావరణంలో తరచూ మార్పులు రావడం, పరాగసంపర్కం సరిగా జరగకపోవడం వల్ల దాదాపు 20 శాతం మేర నష్టం వాటిల్లిందని అక్కడ తోటమాలులు తెలిపారు. యాపిల్ చెట్లు వికసించే దశలో ఉన్నప్పుడు హిమాచల్‌లోని చాలా పండ్లు వర్షం మరియు మంచు కారణంగా ప్రభావితమయ్యాయి. తేనెటీగలు మగ పువ్వుల నుండి పుప్పొడిని సేకరించి ఆడ పువ్వులను పరాగసంపర్కం చేస్తాయి.ఇవి లేకపోవడంతో సంపర్కం జరగక పళ్ళు ఏర్పడడం ఆగిపోతుంది. ఈ మేరకు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఆపిల్ ఉత్పాదన భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి

రైతన్నలకు శుభవార్త: తడిచిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ..

image credit: pexels.com

Share your comments

Subscribe Magazine

More on News

More