రానున్న 3 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉన్న ప్రాంతం ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి శనివారం బలహీనపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని హెచ్చరించింది. రెండు రోజులు అవసరం ఉంటేనే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు భావిస్తున్నారు.
Share your comments