News

అయ్యో ఇంత ఘోరమైన విద్వంసమా? తెలంగాణాలో వర్షబీభత్సం!

Sandilya Sharma
Sandilya Sharma
Telangana hailstorm April 2025, crop damage due to hail (Image Courtesy: Google Ai)
Telangana hailstorm April 2025, crop damage due to hail (Image Courtesy: Google Ai)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వర్షాల దాటికి పంటలు తుడిచిపోగా, చెట్లు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, జనగామ, కామారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాల్లో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వడగండ్ల వర్షానికి వేరే చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు.

పంటలు నేలకొరిగిన విపరీత పరిస్థితి (hailstorm effect on agriculture)

సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన 9 మండలాల్లో 9,149 ఎకరాల్లో పంట నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా వరి (6,321 ఎకరాలు), మామిడి (1,141 ఎకరాలు), మొక్కజొన్న (33 ఎకరాలు), కూరగాయలు (1,654 ఎకరాలు) తీవ్రంగా దెబ్బతిన్నాయి. సంగారెడ్డిలో 10 మండలాల్లో గాలి దుమారాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. జనగామ, మహబూబ్‌నగర్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోనూ వడగండ్ల వాన పంటల్ని నేలకూల్చింది.

పిడుగుపాటుతో మానవ, పశు నష్టం (April rains damage TG)

సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు (lightning deaths Telangana). సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఇంటర్ విద్యార్థి సంతోష్, నల్లగొండ జిల్లా గుర్రంపోడులో మేకల చిన్న రాములు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో పిడుగుపాటుతో పాడిపశువులు మృత్యువాతపడ్డాయి. పలు చోట్ల ఆవులు, కాడెట్లు, దున్నపోతులు మృతిచెందాయి. అకాల వర్షాలతో పంట కోల్పోయిన ఓ రైతు, అప్పు కట్టాలని ఎరువుల వ్యాపారి ఒత్తిడి చేయడంతో మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.

Siddipet hail news, Mahabubnagar weather disaster, farmers' loss Telangana (Image Courtesy: Google Ai)
Siddipet hail news, Mahabubnagar weather disaster, farmers' loss Telangana (Image Courtesy: Google Ai)

హైదరాబాద్‌లో గాలివాన ఆగడాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం ఆస్తి నష్టం మిగిల్చింది. చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా నిలిచింది. మధురానగర్, గోల్కొండ చౌరస్తా, హిమాయత్‌నగర్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో హోర్డింగులు నేలకొరిగాయి.

పంట నష్టంపై ప్రభుత్వం స్పందన

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం, మార్చి 21 నుంచి 23 వరకు, మరియు ఏప్రిల్ 3 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. రైతుల ఆవేదన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో, AEVOల సర్వే ఆధారంగా రూ.10,000 ఎకరా చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు.

మున్ముందు వాతావరణ హెచ్చరిక

బేగంపేట వాతావరణ కేంద్రం ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతుల విజ్ఞప్తి: వెంటనే పరిహారం చెల్లించాలి

ఈదురుగాలుల తాకిడికి రైతులు చేతికొచ్చిన పంట కోల్పోయారు. నష్టపరిహారం వెంటనే చెల్లించి, భవిష్యత్తులో రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం‌ను కోరుతున్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణ సహాయం అందించాలన్నది రైతుల ప్రధాన డిమాండ్.

ఈ వడగండ్ల వాన రైతుల జీవితాల్లో గాయంగా మిగిలింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, పంట నష్టాన్ని ఎదుర్కొన్న రైతులకు మద్దతుగా నిలవాలి.

Read More:

కేవలం రెండు బస్తాలు చాలు, పక్కాప్రణాలిక తో కలెక్టర్

రూ.1600 కోట్లతో కొత్త M-CADWM ఉపపథకం ప్రారంభం, రైతులకు మంచిదేనా ?

Share your comments

Subscribe Magazine

More on News

More