News

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు జీతాలు అందేది అప్పుడే? ఆలస్యంపై సైతం క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స..

Gokavarapu siva
Gokavarapu siva

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాల జాప్యంపై చర్చ సాగింది. ఈ జాప్యం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘం పట్ల గౌరవం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తోందని విపక్ష పార్టీలతో సహా వివిధ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. టీచర్ల జీతాల చెల్లింపులో జాప్యంపై ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సాంకేతిక సమస్యల వల్లే టీచర్ల వేతనాలు ఖాతాల్లో జమ కావడం ఆలస్యం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు సెప్టెంబరు 7 లేదా 8లోగా జీతాలు ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గురుపూజోత్సవాన్ని విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి గడివాడ అమర్‌నాథ్‌లు హాజరు అయ్యారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి పురస్కారాలు అందజేశారు.

కొన్ని సాంకేతిక కారణాలతో ఏపీ టీచర్ల వేతనాలలో జాప్యం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించామని ఆయన వివరించారు. ఉపాధ్యాయులకు వచ్చే రెండు, మూడు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లో జమ చేస్తామని, వారికి అందాల్సిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..

సెప్టెంబర్ 14లోపు మీ ఆధార్ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో ఇలా అప్డేట్ చేసుకోండి..!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు రావడం లేదని, సర్కార్ తమ కష్టాన్ని పట్టించుకోవడం లేదని పలు సందర్భాలలో ఉద్యోగులు వాపోయారు. తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సమస్య తీవ్రతను తెరపైకి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ సకాలంలో వేతనాలు అందకపోవడానికి కారణం పూర్తిగా సాంకేతిక పరమైనదేనని, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం లేదని తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో ప్రశంసనీయమైన ఫలితాలు సాధించాయని గుర్తుచేశారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పారు. నాణ్యమైన పుస్తకాలు, పాఠశాలలు, పిల్లలకు సౌకర్యాలు కల్పించడాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను స్వయంగా ప్రధాని మోదీ ప్రశంసించారని మంత్రి బొత్స ఈ సందర్భంగా తెలిపారు.

ఇది కూడా చదవండి..

సెప్టెంబర్ 14లోపు మీ ఆధార్ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో ఇలా అప్డేట్ చేసుకోండి..!

Share your comments

Subscribe Magazine

More on News

More