News

దసరా నుంచి పేదలకు ఇందిరమ్మ ఇళ్ల; ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

KJ Staff
KJ Staff
Good news: Telangana Government Plans to Provide Indiramma Houses for the Poor from Dussehra (source: CMO Telangana )
Good news: Telangana Government Plans to Provide Indiramma Houses for the Poor from Dussehra (source: CMO Telangana )

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.అన్ని జిల్లాలో గ్రామా స స్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాల‌ని సూచించారు. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌న్నారు.

 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో మంత్రి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం గారు సమీక్షించారు.

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఇత‌ర రాష్ట్రాలకు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఇళ్లు మంజూరు అవుతుంటే, తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్య‌లో సాధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.

రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృథాగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్య‌మంత్రి గారు అధికారుల‌కు సూచించారు.

తెలంగాణ :రాష్ట్రంలో ప్ర‌తి ఫ్యామిలీ ఒకే డిజిట‌ల్ కార్డు; అన్ని పథకాలు వర్తిపు

డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్త‌యినా వాటిని ఎందుకు అప్ప‌గించ‌కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల‌కు ఆ ఇళ్ల‌ను అప్ప‌గించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గించాల‌ని చెప్పారు.

తెలంగాణ :రాష్ట్రంలో ప్ర‌తి ఫ్యామిలీ ఒకే డిజిట‌ల్ కార్డు; అన్ని పథకాలు వర్తిపు

Related Topics

cm revanth reddy

Share your comments

Subscribe Magazine

More on News

More