ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అందించడానికి రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండటానికి 'నేతన్న నేస్తం' పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వెంకటగిరి పట్టణంలోని ఎస్ఎల్ఆర్ కల్యాణ మండపం సమీపంలోని మైదానంలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించనున్నారు.
ఈ మైదానంలో ఈరోజు భారీ బహిరంగ సభలో పాల్గొని నేతన్నలకు ఐదో విడత మొత్తాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. బహిరంగ సభాప్రాంగణం వద్ద సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చేనేత కార్మికులతో ముచ్చటించనున్నారు. వారితో కలిసి ఫొటోషూట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అర్హులైన నేతన్నల జాబితా లిస్ట్ ను ఇప్పటికే గ్రామా మరియు వార్డు సచివాలయాల్లో సేకరించారు.
వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ నేతన్న నేత కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ నేతన్నలకు నిరంతరం సహాయాన్ని అందజేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 24,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ చొరవ ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో 80,686 మంది నేత కార్మికులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.
ఇది కూడా చదవండి..
హైదరాబాద్ లో భారీ వర్షాలతో జలమయం అయిన రోడ్లు.. సహాయం కోసం టాల్ ఫ్రీ నంబర్ ఇదే
రూ.193.64 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ .1.2 లక్షలు సాయం అందుతోంది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేతగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కచ్చితంగా చేనేత సంఘంలో నమోదు చేసుకోని ఉండాలనే నిబంధన ఉన్న విషయం విదితమే.
ఇది కూడా చదవండి..
Share your comments