2023 జూన్ 26 నుంచి వానకాలం సీజన్‌కు 'రైతు బంధు' పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికారులను ఆదేశించారు.
వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసం ' రైతు బంధు ' వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం నిధులను జూన్ 26, 2023 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సోమవారం అధికారులను ఆదేశించారు .
వర్షాకాలం ప్రారంభానికి ముందే వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించేందుకు నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనీ . ఇందుకోసం రూ.7,500 కోట్లు సమీకరించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
ఈవానాకాలం సీజన్‌లో 'పోడు' రైతులకు కూడా రైతుబంధు పథకం వర్తిస్తుందని త్వరలో పోడు రైతులకు పట్టాలను పంపిణి చేసి వారికీ కూడా రైతుబంధు అందిస్తామని పోడు పట్టా పొందిన గిరిజన రైతులకు రైతుబంధు సాయం క్రింద ఎకరానికి రూ.5,000 అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు .
రైతుబంధు పోర్టల్ లో మీ వివరాలు సవరణ చేసుకునే అవకాశం
పథకం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రూ.65,559.28 కోట్లు రైతుబంధు నిధులను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.15,075 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది. మొత్తం మీద, 2022-23లో యాసంగి (రబీ) సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులు రైతుబంధు సహాయాన్ని పొందారు.
Share your comments