News

వాలంటీర్లకు శుభవార్త: 14 నుంచి 'వలంటీర్లకు వందనం'

Gokavarapu siva
Gokavarapu siva

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అందజేయాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వాంలంటీర్ల వ్యవస్థను స్థాపించింది. రాష్ట్రంలో ఈ వలంటీర్ల ద్వారా నెలవారీ రేషన్ పంపిణి మరియు వృద్దులకు పింఛన్ల పంపిణి అనేది చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అవినీతికి పాలుపడకుండా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కహరిస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వారికి సత్కారాలను ముఖ్యమంత్రి అందజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సత్కారాలను అందించడానికి 2.33 లక్షల మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వీటిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ అవార్డులను వాలంటీర్లకు వారి పనితీరును ఆధారంగా తీసుకుని ఇవానున్నారు. ఈ అవార్డులను మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు. ఆ మూడు రకాల పురస్కారాలు ఏమిటంటే సేవా వజ్ర, సేవారత్న పురస్కారం మరియు సేవావిుత్ర పురస్కారం.

రాష్ట్రంలో ఈ వాంలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి 2019 ఆగస్టు 15వ తేదీన ప్రవేశపెట్టారు. కుల, మత భేదాలు లేకుండా ప్రజలకు మధ్య వివిధ సంక్షేమ పథకాల అమలులో వారధులుగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను ప్రతి సంవత్సరం 'వలంటీర్లకు వందనం' పేరుతో ఉగాది రోజున వారికి సత్కారాలను అందిస్తుంది.

మూడో ఏడాది కూడా వారికి సత్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉగాది సమయంలో అమలులో ఉండడంతో ఏప్రిల్ 14వ తేదీన 'వలంటీర్లకు వందనం' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అనంతరం దాదాపు నెల రోజులపాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు ఊరట.. పెరిగిన ధర

ఒక సంవత్సరం పాటు ఎటువంటి ఫిర్యాదులు 2,33,719 మంది వలంటీర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ వాలంటీర్లకు అవార్డులతో పాటు నగదు మరియు సర్టిఫికెట్లను కూడా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో ఐదుగురు వలంటీర్ల చొప్పున 875 మంది వలంటీర్లకు 'సేవా వజ్ర' పురస్కారంతో సత్కరించనున్నారు. ప్రభుత్వం వీరిని రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌తో సత్కరిస్తారు.

రాష్ట్రంలో నగరపాలక సంస్థ నుండి 10 మంది మరియు ప్రతి మండలం, మునిసిపాలిటీ నుండి ఐదుగురు వలంటీర్ల చొప్పున 4,220 మందిని 'సేవారత్న' పురస్కారంతో సత్కరించనున్నారు. ప్రభుత్వం వీరిని రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌ అందజేసి సత్కరిస్తారు. 2,28,624 మందికి 'సేవావిుత్ర' పురస్కారం, రూ.10 వేల నగదు అందజేస్తారు.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు ఊరట.. పెరిగిన ధర

Share your comments

Subscribe Magazine

More on News

More