ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం యొక్క సేవలు గురించి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భారీగా ఈ ప్రచార కార్యక్రమాన్ని జరపాలని, మరియు ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15 నుండి జరిపించనున్నట్లు తెలిపారు. ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నామన్నారు. రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రోజున వారికి ఈ ఆర్థిక సహాయం వెంటనే అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి కావాల్సిన ఎస్‌ఓపీని రూపొందించాలని సూచించారు.
ఈ ప్రచారంలో YSR విలేజ్ క్లినిక్‌ల సిబ్బంది, ANMలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు మరియు సెక్రటేరియట్ సిబ్బంది వంటి వివిధ వ్యక్తులు మరియు సమూహాలు పాల్గొంటాయి. ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరూ తమ సంబంధిత అధికార పరిధిలోని ఇళ్లను సందర్శించి వారికి ఆరోగ్యశ్రీ కార్యక్రమం గురించి సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహిస్తారు.
డా.వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేశామని, ఇప్పుడు వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు వర్తిస్తుందని తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు.
ఇది కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం
గతంలో ఆరోగ్యశ్రీ కేవలం 1,059 ప్రొసీజర్ ఉంటే.. ఇప్పుడు ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచామన్నారు సీఎం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్స్‌ను పథకంలోకి తెచ్చామని.. నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా సమర్థంగా సేవలు అందుకునేలా చూడాలన్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందజేయడంతోపాటు సమర్థంగా సేవలు అందుకునేలా చూడాలన్నారు. ఈ ఆరోగ్యశ్రీ సేవలను పొందడంలో ప్రజలు ఇబ్బందులు వస్తే, లంచాల ప్రస్తావన వచ్చినా వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి..
Share your comments