ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వీటితోపాటు రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి వారికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను ఆర్బికే ల ద్వారా రైతులకు పంపిణి చేస్తుంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మరో అడుగు ముందుకు వేస్తూ 'జగనన్నే మా భవిష్యత్తు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు అవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలియజేసారు. ఈ కార్యక్రమం నిన్న అనగా శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మోయహం 14 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు, అంటే ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది.
ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం చాలా గొప్పదని మరియు రాష్ట్రంలో ఈ పథకం కింద అందించే వైద్య సేవలు ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగపడతాయని వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్ అన్నారు. భవిష్యత్తులో మన దేశానికే ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ఆదర్శంగా నిలుస్తుందని అయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళతారని చెప్పారు.
ఇది కూడా చదవండి..
రాష్ట్రంలో రైతులకు పరిహాసంగా మిగిలిన నష్ట పరిహారం..
రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలు గుండె, బిపి, సుగర్ వంటి వివిధ రకాల జబ్బులతో బాధపడుకున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేద ప్రజలకు 60 రకాల పరీక్షలు ప్రతి పిహెచ్‌సిలో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్ల వల్ల ప్రజలు లేని జబ్బులను తెచ్చుకుంటున్నారు అని అన్నారు.
రాష్ట్రంలో ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లో సందర్శిస్తారు. దీనితో 80 శాతం మంది ప్రజలకు వారి ఆరోగ్య అవసరాలు వారి సొంత ఊళ్లోనే తీరిపోతాయని తెలిపారు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరితో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు మాట్లాడి వారి అనుమతితో ఆ కుటుంబ సభ్యుల ఫోన్ నుంచి 8296082960 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments