ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ గ్రామ సచివాలయాల పరిపాలనా మరియు పాలనా నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
గ్రామ సచివాలయాల్లో సమాచార హక్కు (ఆర్‌టిఐ) వ్యవస్థ అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసేందుకు, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ రాజశేఖర్, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం అధికారులను నియమించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ సమాచార ఉత్తర్వు జీవో నం. 437ను జారీ చేశారు.
ప్రతి గ్రామ సచివాలయంలో సమాచార హక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ – పీఐవో)లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ సెక్రటేరియట్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ ఏపీఐఓగా, పంచాయతీ కార్యదర్శి నియమించబడిన పీఐవోగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత పెంచేందుకు సచివాలయల్లో ఈ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయ స్థాయిలో పరిష్కారం కాని వినతులపై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ అథారిటీగా మండల ఎంపీడీవో పని చేస్తారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..
ఈ నెల 16 న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం
మరొకవైపు, పెన్షన్ రాలేదని ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్త అందించారు . అన్ని అర్హతలు ఉండి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న వారి సంశయాలను తీర్చి వారికీ పెన్షన్ అందించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జగనన్న సురక్ష పథకం ద్వారా గుర్తించిన వారిని ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలో చేర్చనుంది. దీనితో అర్హులైన వారు ఇప్పుడు పెన్షన్ పొందే అవకాశాన్ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments