తెలంగాణ రైతులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం, రైతులను సంప్రదాయ విద్యుత్ వాడకం నుంచి సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు బుధవారం ఆదేశించారు.
మొదట తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను కోరారు. అదేవిధంగా సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టా లని అధికారులను ఆదేశించారు. సోలార్ పంప్ సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
వివిధ శాఖల్లో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వంట గ్యాస్‌కు బదులుగా సోలార్ సిలిండర్ వ్యవస్థను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోండి. మహిళా సంఘాలకు వీటిపై శిక్షణ ఇచ్చి సోలార్ సిలిండర్ వ్యాపారం వైపు ప్రోత్సహించాలి. అటవీ భూముల్లో కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి.
ఏటా 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాపార కేంద్రంగా మారనుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. ఐటీ, పరిశ్రమల శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అని సీఎం చెప్పారు.
Share your comments