ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తానికి 26 పప్పుశనగ కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.చంద్రానాయక్ తెలియజేసారు. ఈ ఏడాది జిల్లాలో ఎక్కువ మొత్తంలో రైతులు శనగ పంటను సాగు చేశారు. ఈ పంటల నుండి ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఈ కేంద్రాల ఏర్పాటుతో అమ్మకానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు కలిగేలా శనగకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) ఒక క్వింటా శనగకు రూ.5,335 ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర అనేది మార్కెట్ ధర కన్నా ఎక్కుగా ఉంది. కాబట్టి రైతులు కూడా బయట మార్కెట్ లోకి విక్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించాలని భావిస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది.
రైతుల నుండి ఈ శనగను ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఆర్బీకే వేదికగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ-క్రాప్ డేటా ఆధారంగా 20 వేల మెట్రిక్ టన్నుల వరకు పప్పుశనగ సేకరణకు అనుమతి ఉందన్నారు. సీఎం యాప్ లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1600 మంది వరకు పప్పుశనగ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ఎకరం నుండి ఈ సంవత్సరం ఆరు నుండి ఎనిమిది క్వింటాళ్ల వరకు పంట దిగుబడులు వచ్చినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్: ఉచితంగా రూ.50 లక్షల వరకు ఇన్సూరెన్స్
ఇది ఇలా ఉండగా జిల్లాలో జొన్నలను పండించిన రైతులు దిగుబడిని విక్రయించాలి అనుకుంటే ఆర్బీకేలకు సంప్రదించాలని సూచించారు. జొన్నలకు ప్రభుత్వం క్వింటాకు రూ.2,970 మద్దతు ధరను అందిస్తుంది. పంటను అమ్మిన వెంటనే రైతులకు డబ్బులను చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ కేంద్రాల ఏర్పాటుతో అమ్మకానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments