ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి వాహనదారులు వారితో భౌతికంగా డ్రైవింగ్ లైసెన్స్ ను క్యారీ చేయవలసిన అవసరం లేదు. ఈ నిర్ణయాన్ని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లెస్ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్ లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా పయనించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తలతగా స్వాగతించింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో భౌతిక లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డ్‌లను ముద్రించే సాంప్రదాయ పద్ధతి ఇక ఉండదు. ప్రపంచం డిజిటలైజేషన్ నేపధ్యంలో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ తో పాటు ఎం- పరివాహన్ అప్లికేషన్ లో ఇవి అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ, సాధారణంగా రాష్ట్రంలో దరఖాస్తుదారులకు ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులను సరఫరా చేస్తుంది. రవాణా శాఖ దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను జారీ చేయడానికి 200 రూపాయల ఫీజును మరియు పోస్టల్ ఛార్జీలకు 35 చార్జీలను వసులు చేస్తుంది.
ఇది కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీ పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు విధిస్తూ జీవో విడుదల
శుక్రవారం నుంచి రవాణా శాఖ ఈ పాత విధానానికి ముగింపు పలికనుంది. మరోవైపు ఆ కార్డ్ ల కొరత వచ్చి ఏడాదిగా పెండింగ్ లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల ప్రింటింగ్ జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే 33.39 రూపాయల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఈ శనివారం నుండి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు మరియు డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దరఖాస్తుదారులకు చార్జీల భారం తగ్గుతుంది. ప్రభుత్వం ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను డిజి లాకర్ లేదా ఎం-పరివాహన్ అనే మొబైల్ అప్లికేషన్స్ లో ఉంచనున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి..
Share your comments