News

రైతులకు శుభవార్త : మిస్ట్ కాల్‌తో బ్యాంకు లోన్... పంజాబ్ నేషన్ బ్యాంకు కీలక నిర్ణయం ..

Srikanth B
Srikanth B
Bank loan to farmers
Bank loan to farmers

పెద్ద పెద్ద వ్యాపారులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే బ్యాంకులు సులభంగా లోన్ లను ఇస్తుంటాయి , అయితే రైతు విషయానికి వస్తే పరిస్థితి మరోలాగా ఉంటుంది , రైతు లోన్ తీసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి అన్ని పత్రాలు సరిగా ఉన్న బ్యాంకు అధికారులకు రైతులకు లోన్ ఇవ్వడానికి సంకోచిస్తుంటారు , నెలల పాటు  తిరిగిన బ్యాంకు ఋణం లభిస్తుందన్న గ్యారంటీ ఉండదు .

 

అయితే పంజాబ్ నేషన్ బ్యాంకు రైతులకు శుభవార్త అందించింది ఒక మిస్ కాల్ ఇస్తే రైతులకు ఋణం అందించేందుకు సిద్ధం అయింది . దీని క్రింద రైతులకు ఎరువులు, విత్తనాలు, నిత్యావసర సరుకుల కోసం బ్యాంకు తక్కువ వడ్డీలకు రుణాలు అందించనుంది . తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తోంది. ఇప్పుడు చాలా నామమాత్రపు నిబంధనలతో సులభంగా రుణాలు ఇస్తోంది. ఈమేరకు పంజాబ్ నేషన్ బ్యాంకు తన ట్విట్టర్ ఖాతాలో సర్కులర్ ను ట్విట్ చేసింది .

ఈ రుణం ఏ విధముగా లభిస్తుంది..?

మీరు కూడా పంజాబ్ నేషనల్ బ్యాక్ ప్రత్యేక ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. సులభంగా పొందవచ్చు. దీని కోసం మీరు పీఎన్‌బీ అగ్రికల్చర్ లోన్ కింద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే పద్ధతులను బ్యాంక్ చాలా సులభతరం చేసింది. ఈ మార్గాలలో దేనిలోనైనా మీరు లోన్ తీసుకోవచ్చు.

ఆధార్ కార్డు తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు -ఆదాయపు పన్ను శాఖ !

రుణం ఇలా తీసుకోవచ్చు..

మీకు రుణం కావాలంటే 56070కి 'LOAN' అని SMS చేయండి
ఇది కాకుండా 18001805555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు కాల్ సెంటర్‌ను 18001802222లో సంప్రదించడం ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కాకుండా నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ netpnb.com ఆప్షన్ కూడా ఉంది.
మీరు పీఎన్‌బీ వన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు -ఆదాయపు పన్ను శాఖ !

Share your comments

Subscribe Magazine

More on News

More