News

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ..!

Gokavarapu siva
Gokavarapu siva

జగన్ సర్కార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కౌలు రైతులకు మంచి శుభవార్తను అందించింది. రైతు భరోసా కేంద్రాల (RBKలు) సౌజన్యంతో ఈ సంవత్సరం 7.77 లక్షల మంది రైతులకు కౌలు కార్డులను అందజేసారు. ఈ రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ కూడా అప్లోడ్ చేసినట్లు తెలిపారు.

ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి జగన్, రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా కేటాయించి, బదిలీ చేస్తానని తెలియజేసారు. వరుసగా ఏడో ఏడాది కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములు సాగుచేసే వారికి రైతు భరోసా నిధులను అందించనున్నట్లు తెలిపారు.

సిసిఆర్సిలు పొందిన వారిలో అర్హులైన 1,42,693 మంది కౌలుదారులతో పాటు 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లను జమ చేయనున్నారు. దానితోపాటుగా ఈ సంవత్సరం కౌలు రైతులకు భారీగా రూ.4వేల కోట్ల పంట రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత నాలుగు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువగా కౌలు కార్డులను ప్రభుత్వం జారీ చేసింది.

ఇది కూడా చదవండి..

సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.!

గత నాలుగేళ్లుగా ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్యక్రమం ద్వారా పంట రుణాలు, పలు రకాల సంక్షేమ ఫలాలను అందజేస్తూ కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. 2019-20లో, మొత్తం 272,720 మంది రైతులకు CCRC కార్డ్‌లు జారీ చేసింది, 2020-21లో 414,770 మంది వ్యక్తులు మరియు 2021-22లో 524,203 మంది రైతులకు CCRC కార్డ్‌లు జారీ చేసింది.

ఇది కూడా చదవండి..

సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.!

Share your comments

Subscribe Magazine

More on News

More