News

రైతులకు శుభవార్త.. నవంబర్ మొదటి వారంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్తను అందించింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా వారికి ఆర్ధిక సాహాయాన్ని అందిస్తున్న విషయం మనకి తెలిసిందే. వచ్చేనెల నవంబర్ మొదటి వారంలో వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సహాయాన్ని రైతులకు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాల శాఖల పురోగతి, అభివృద్ధిపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత పంటల సాగు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులు సీఎంకు సవివరంగా వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షపాతం సగటు స్థాయిలకు చేరువలో నమోదైందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 13,500 సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో 2023-24 ఆర్థిక సవంత్సరానికి తొలి విడత సాయం రూ. 7,500 రైతులకు ఇప్పటికే అందింది. అయితే రెండో విడత సాయాన్ని నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.31,005 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. మార్కెట్ లో పత్తికి రూ.7,020 మద్దతు ధర

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులు కూడా ఏటా రూ. 13,500 సాయాన్ని పొందుతున్నారు. తొలుత ఈ పథకం ద్వారా రూ. 12,500 పెట్టుబడి సాయం అందించింది ప్రభుత్వం. ఆ తర్వాత మరో రూ. 1,000 పెంచి రూ. 13,500 సాయాన్ని అందిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తోంది.

ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి అన్నారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.31,005.04 కోట్లు అందించామని.. త్వరలో రెండో విడత రైతు భరోసాను అకౌంట్‌లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నవంబర్‌ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి అన్నారు. రబీలో సాగుచేసే శనగ విత్తనాలపై సబ్సిడీని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచామన్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త.. మార్కెట్ లో పత్తికి రూ.7,020 మద్దతు ధర

Share your comments

Subscribe Magazine

More on News

More