తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో మరియు కొన్ని పెద్ద నగరాలలో పట్టణానికి పనికోసం వచ్చే వారికీ తక్కువ ధరకు భోజన సౌకర్యాన్ని అందిస్తున్న పథకం అన్నపూర్ణ పథకాన్నిఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో, రైతు బజార్లలో 'అన్నపూర్ణ పథకాన్ని' అమలు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల ఆకలి కష్టాలు తీరనున్నాయి.
రాష్ట్రవ్యప్తంగా రైతు లు సమీప పట్టణ మార్కెట్టుకు వెళ్ళినప్పుడు రోజువారీ లో అధిక మొత్తంలో వారి భోజనానికి ఖర్చు చేయవసి వస్తుంది . కొన్నిసార్లు రెండు ,మూడు రోజులపాటు తిరగడం మరియు కొన్ని సార్లు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది దీనితో భోజనానికి అధికమొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది దీనితో ప్రభుత్వం మానవతా దృక్పధంతో ఆలోచించి ఆ మార్కెట్లలో అన్నపూర్ణ పథకాన్ని త్వరలో అందించడానికి సన్నాహాలు చేస్తుంది .
"రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ "-రేవంత్ రెడ్డి
అన్ని సవ్యంగ జరిగితే తొందరలోనే రాష్ట్ర వ్యాప్తముగా రాష్ట్రంలో 192 మార్కెట్ యార్డులు, 87 ఉప యార్డులు ఉన్నాయి. సీజన్ సమయంలో మొత్తం రూ.10 వేల మంది రైతులు ప్రతీ రోజు వస్తుంటారు దీనితో రైతులకు కొంత మేర ఉపశమనం కల్గవచ్చు .
ఇప్పటివరకు అన్నపూర్ణ పథకాన్ని హైదరాబాద్ సహా పలు నగరాల్లో, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం రూ.5కే భోజనం అందజేస్తారు. దీనికి ప్రభుత్వం రూ.21 రాయితీ అందజేస్తుంది.
ఈపథకం అమలులోకి వస్తే రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని , రైతుల ఖర్చులను తగ్గించిన నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు .
Share your comments