రైతులకు శుభవార్త చెప్పిన ఇఫ్కో (ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ) సంస్థ. భారతదేశంలోనే అతి పెద్ద ఎరువుల తయారీ సంస్థ అయిన ఇఫ్కో వారు ఉత్పత్తి చేసే ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వలన దేశంలో చాల మంది రైతులకు ఎరువులపై ఖర్చులు తగ్గడం వలన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన పేద రైతులకు చాలా మేలు జరుగుతుంది అని ఇఫ్కో సంస్థ బావిస్తుంది.
భారతదేశ ప్రభుత్వం ఎవరువులపై రైతులకు సబ్సిడీలను అందిస్తుంది. ఇంచుమించుగా 80 శాతం వరకు అనేక ఎరువుల కంపెనీలకు సబ్సిడీలను అందిస్తుంది. ఈ సబ్సిడీలను అందించడం వలన రైతులకు ఖర్చు తగ్గి, ఎక్కువ సాగును చేస్తారు. దీనివల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడకుండా ఉంటుంది. పంటలు పండించడానికి కావలసిన ప్రధాన ఎరువులయిన ఎన్పికేఎస్ యొక్క ధర తగ్గడం వలన కేవలం రూ.1200 లకే మార్కెట్ లో లభ్యమవుతుందని ఇఫ్కో అధికారులు చెప్పారు.
ఈ ఎరువుల తయారీలో కొత్త సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపారు. దీనివల్ల తయారీ ఖర్చు తగ్గుతుందని ఇఫ్కో సంస్థ తెలిపింది. తయాయి ఖర్చు తగ్గినందున, ఎరువుల ధరలు తగ్గించి రైతులకు మేలు చేయాలని ఇఫ్కో సంస్థ భావిస్తుంది. తద్వారా దేశంలో వ్యవసాయం పెరిగి ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ నిర్ణయంతో దేశంలో పేద రైతులకు ఎక్కువ లాభం ఉంటుంది.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త.. ఈ తేదీన అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు..
ఇఫ్కో కంపెనీ తన ఉత్పత్తులపై 14 శాతం ధరలను తగ్గించనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువులపై సబ్సిడీల కొరకు రూ.1.75 లక్షల కోట్లు కేటాయించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఏది 22 శాతం తక్కువ. ఈ సంవత్సరం పోటాష్, ఫాస్ఫెట్ ఎరువులపై సబ్సిడీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి రైతులకు తక్కువ ధరలోనే ఎరువులు లభిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధర పెరుగుతున్నందున, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వీటిని నివారించడానికి ఎరువుల ధరలు తగ్గిస్తున్నట్లు ఇఫ్కో అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి..
Share your comments