News

రైతులకు శుభవార్త: సబ్సిడీతో ఆర్బికేలా ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభం..

Gokavarapu siva
Gokavarapu siva

సోమవారం నుంచి సబ్సిడీ వేరుశనగ విత్తనాల కేటాయింపు ప్రారంభమైంది. కళ్యాణదుర్గం మండలానికి చెందిన పాలవాయి ఆర్‌బీకేలో ఈ వేరుశెనగ విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విత్తనాల పంపిణీని మంత్రి ఉషశ్రీ చరణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. దీనిని అనుసరించి, వివిధ మండలాలకు సంబంధించిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వంటి ప్రజా అధికారులు అధికారికంగా విత్తనాలను పంపిణీ చేస్తారు, వ్యవసాయ శాఖ మరియు ఏపీ సీడ్స్ ఈ ప్రక్రియకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో భాగంగా ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు వీలు కల్పించడమే ఈ పంపిణీ లక్ష్యం. జిల్లావ్యాప్తంగా 40 శాతం రాయితీతో మొత్తం 78,245 క్వింటాళ్ల విత్తన వేరుశనగను పంపిణి చేయుటకు మంజూరు చేశారు. మొత్తానికి 76,945 క్వింటాళ్ల కే-6 రకం మరియు 1,300 క్వింటాళ్ల కదిరి-లేపాక్షి 1812 రకాలను పంపిణీ కొరకు కేటాయించారు.

42 వేల మంది రైతులు ఇప్పటి వరకు ఆర్‌బీకేలు కేంద్రంగా 38 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాల కొరకు నమోదు చేసుకున్నారు. దీనితపాటు 25 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాల పంపిణీ కొరకు 280 ఆర్‌బికెలలో అంతా సిద్ధం చేసి ఉంచారు. 30 శాతం రాయితీపై ఎల్‌ఆర్‌జి-41,52 రకాల కందులను 4,300 క్వింటాళ్లు కేటాయించారు. 156 క్వింటాళ్ల ఐపిఎం 2-14 రకం పెసలు మరియు 42 క్వింటాళ్ల వివిధ రకాల మినుము విత్తనాలైన పియు-31, ఎల్‌బిజి. -752, ఐపీయూ 2-43, మరియు టీబీజీ-104 కేటాయించారు.

ఇది కూడా చదవండి..

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఫ్రీగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు..

అదనంగా 50 శాతం రాయితీతో 250 క్వింటాళ్ల ఎస్‌ఐఎ-3156 రకం కొర్రలు, 3 క్వింటాళ్ల ఇంద్రావతి రకం రాగులను కేటాయించారు. ఆర్బికేలో నమోదు చేసుకున్న రైతులు 200 క్వింటాళ్ల వరకు జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు (పచ్చి ఎరువు) 50 శాతం రాయితీతో పొందవచ్చు. సోమవారం నుంచి గ్రామాలకు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందజేసి రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించనున్నారు.

ఈ నెల 30న వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ కార్యక్రమం కింద ప్రతి రైతు ఖాతాలో రూ.7,500 జమ కానుంది. బ్యాంకుల్లో త్వరితగతిన పంట రుణాల రెన్యూవల్‌ చేయడం వల్ల ఖరీఫ్‌ సీజన్‌లో ఇబ్బందులు ఉండవని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 78 వేల క్వింటాళ్ల వేరుశనగ సేకరించారు.

ఇది కూడా చదవండి..

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఫ్రీగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు..

Share your comments

Subscribe Magazine

More on News

More