గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వినియోగదారులకు ఎట్టకేలకు శుభవార్త అందించింది , వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 91 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తున్న చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.50 మేర తగ్గించాలని నిర్ణయించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
తాజాగా తగ్గిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ రూ.2028కి తగ్గింది. ఇప్పటివరకు రూ.2,119.50గా ఉన్నది. ఇక కోల్‌కతాలో రూ.2221 నుంచి రూ.2132కు, ముంబైలో రూ.2071గా సిలిండర్ ధర రూ.1980కి, చెన్నైలో రూ.2268 నుంచి రూ.2176.5కు తగ్గింది హైదరాబాద్ లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ . 2325 ఉండగా తగ్గినా ధరతో రూ . 2234 కు తగ్గనుంది .
12 వేలకు పెంచనున్న పీఎం కిసాన్.. వార్తల్లో నిజమెంత !
ప్రతి సంవత్సరం ఒక్కో కుటుంబానికి 12 సిలిండర్ ధరలను సబ్సిడీ ధరలను కేంద్రం అందిస్తుంది. మరియు ఈ సబ్సిడీ ను ఈ సంవత్సరం కొనసాగనించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది .
Share your comments