ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వైయస్సార్ చేయూత పథకం గురించి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. అయితే వైయస్సార్ చేయూత పథకం యొక్క మూడో విడత నగదు వచ్చే సెప్టెంబర్ నెలలో విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. కాగా ఈ పథకానికి సంబంధించి సచివాలయాల ద్వారా కొత్త అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. కాబట్టి రాష్ట్రంలో ఈ పథకానికి ఎవరైన అర్హులైతే వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. వారికి ప్రతి సంవత్సరం ప్రభత్వం రూ.18,750ను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని అందజేయడమే కాకుండా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొత్త లబ్ధిదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది.
వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ అనగా సెప్టెంబర్ 5 చివరి తేదీ. అర్హులైన వ్యక్తులు వెంటనే తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త, పాత లబ్ధిదారుల ధ్రువీకరణ ప్రక్రియ ఈ నెల 11 వరకు కొనసాగనుంది. మీరు ఇంకా YSR పథకం అందుకోని మహిళ అయితే, ఇవాళ్టిలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఈ నెల 11 వరకు మీ దరఖాస్తుల ధ్రువీకరణ జరుగుతుంది. ఆ తర్వాత నియమనిబంధనల ప్రకారం అర్హులైనవారందరి ఖాతాల్లో రూ. 18, 750 జమ అవుతాయి.
ఇది కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఇవే.!
ఈ పథకానికి అర్హులైన వారికి ప్రభుత్వం మొత్తానికి రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. కానీ మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని ఒకేసారి ఖాతాల్లో జమ చేయకుండా, ప్రతి ఏడాది అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇప్పటికే మూడు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో విడత డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
వైయస్సార్ చేయూత పథకం పత్రాలు
దరఖాస్తు ఫారం.
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్
ఎలక్ట్రిసిటీ బిల్లు
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
రేషన్ కార్డు
ఇది కూడా చదవండి..
Share your comments