ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి ఈ సమీక్ష సందర్భంగా ఈ నెల అనగా ఆగస్టు 10వ తేదీన పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని అందజేస్తామని తెలిపారు.
సాధారణంగా ఈ కార్యక్రమం గత నెల జులై 26వ తేదీన జరగాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల కారణంగా వాయిదా పడింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి అకౌంట్‌లలో జమ చేస్తున్నారు.
గత మూడేళ్లలో ప్రభుత్వం స్థిరంగా నిధులను డిపాజిట్ చేసింది. శ్రద్ధగా రుణాలు చెల్లించే మహిళలకు వైఎస్ఆర్ జీరో వడ్డీ పథకం కింద రూ.4,969.05 కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు.
ఇది కూడా చదవండి..
కేసీఆర్ శుభవార్త.. అసెంబ్లీలో వారికి రూ.1000 కోట్ల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.!
మరొకవైపు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని, చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం జగన్ సూచించారు. అంతేకాకుండా.. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే వారికి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
Share your comments