News

గుడ్ న్యూస్.. దీపావళి సెలవు తేదీలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో వరసగా 3 సెలవులు

Gokavarapu siva
Gokavarapu siva

రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని పంచుతూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగ ఎట్టకేలకు వచ్చేసింది. పండుగ ప్రారంభమైనందున, ఈ శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు ప్రకటించారు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పూర్తిగా సంబరాల్లో మునిగిపోయారు. ఇక నిన్న తెలంగాణలోని విద్యాసంస్థలకు కూడా మూడు రోజులపాటు సెలవులు ఉండనున్నట్లు వెల్లడించారు.

ఏటా తెలంగాణ సర్కార్ ఎంప్లాయిస్‌కు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను అంతకు ముందు సంవత్సరం డిసెంబర్‌లోనే విడుదల చేస్తుంది. ఆ జాబితా ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవు కూడా ఇచ్చారు. అయితే తాజాగా పండితుల సలహా మేరకు సెలవు దినాన్ని మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

షెడ్యూల్ ప్రకారం ఆదివారం రోజున అంటే 12వ తేదీన దీపావళి సెలవు ఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాన్ని సోమవారానికి మార్చేశాయి. దీంతో ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో శని , ఆదివారం అలాగే సోమవారం వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి..

ఢిల్లీ ప్రజలకు కాలుష్యం నుంచి ఉపశమనం! కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీ సంవత్సరం దీపావళి సెలవును (తిథి ద్వయం నాడు) తిధుల ఆధారంగా నిర్ణయిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈసారి కూడా గవర్నమెంట్‌కు వచ్చిన సలహాలు, వినతుల మేరకు దీపావళి సెలవు దినాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి..

ఢిల్లీ ప్రజలకు కాలుష్యం నుంచి ఉపశమనం! కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Share your comments

Subscribe Magazine

More on News

More