పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బాస్మతీయేతర బియ్యం పై నిషేధం విధించింది అయితే దీనిప్రభావంతో ఇతర దేశాలలో బియ్యం ధరలు 12 సంవత్సరాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఎగుమతి పై నిషేధం విధిస్తే ధరలు భారతదేశంలో నియంత్రణలో వుంటాయని కేంద్ర ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నది.
ఈ నిర్ణయంతో దేశంలో బియ్యం నిల్వలు పెరుగుతాయని.. దీని కారణంగా ధరలు నియంత్రణలో వుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల గ్లోబల్ మార్కెట్‌లో బియ్యం ధర ఎక్కువైంది. చాలా దేశాల్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. భారతదేశం బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా.. ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధర 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
ప్రపంచంలోనే అత్యధిక బియ్యం ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ఒక్కటే ప్రపంచ మార్కెట్‌లో 40 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ఇందులో ఒక్క బాస్మతి బియ్యం వాటా 40 లక్షల టన్నులు. భారతదేశం 177.9 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసుతుంది . దీని విలువ 6.36 బిలియన్ డాలర్లు. కాగా, 2022-2023 పంట సీజన్‌లో భారతదేశంలో మొత్తం 13.54 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంతకుముందు 2021-2022 సంవత్సరంలో 12.94 టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్‌లో బియ్యం ఉత్పత్తి పెరిగింది. భారతదేశం టన్నుకు 1200డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న 80 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చౌక ధరకు విక్రయించే బియ్యాన్ని నిల్వ చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
Share your comments