News

నెల రోజుల్లో రుణమాఫీ పూర్తి చేయండి ..

Srikanth B
Srikanth B
నెల రోజుల్లో రుణమాఫీ పూర్తి చేయండి .. మంత్రి హరీష్ రావు
నెల రోజుల్లో రుణమాఫీ పూర్తి చేయండి .. మంత్రి హరీష్ రావు

రైతు రుణమాఫీ ప్రక్రియను నెల రోజులలో పూర్తి చేయాలనీ ఆర్థిక శాఖ మంత్రి హరిశ రావు బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేసారు. రైతుల రుణమాఫీ ప్రక్రియను నెల రోజులలో పూర్తి చేయాలని రైతులెవరైనా ఇప్పటికే బ్యాంకు రుణాలు లక్ష వరకు చెల్లించి ఉంటే వెంటనే వారికీ రుణమాఫీ డబ్బులను నేరుగా వారికీ అందించాలని ఆదేశించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి డబ్బు ఏదో ఒక రూపంలో తమకు చేరిందనే అభిప్రాయం రైతులకు రావాలని అన్నారు. పంట రుణాన్ని రెన్యవల్ చేసేసి మళ్లీ కొత్తగా రుణం ఇస్తే రైతులు ఎంతగానో సంతోషిస్తారని.. వారి జీవితాల్లో ఆనందం నింపేందుకు బ్యాంకర్లు సైతం చొరవ చూపాలని సూచించారు. అలాగే రుణమాఫీ ప్రక్రియను వేగంగా జరిగేలా సహకరించాలని కోరారు. అలాగే రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీ తీరును పరిశీలించడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మొదటి దశలో 35 లక్షల మందికి రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేశామని.. ఇక రెండో విడతలో దాదాపు 37 లక్షల మంది రైతులకు రూ.20,141 కోట్ల రుణ మాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటిదాకా దాదాపు 16 లక్షల 66 వేల మంది రైతులకు రూ.8,097 కోట్లు మాఫీ జరిగిందని అన్నారు.

PM కిసాన్ పథకం 15వ విడతను పొందాలనుకుంటే ఈ పనులు చేయండి..

అయితే లక్ష వరకూ రుణమాఫీ కావాల్సిన రైతులు 20.02 లక్షల మంది ఉన్నారు. ఇప్పటిదాకా రూ. 99,999 వరకు ఉన్న రుణాల మాఫీకే నిధులు విడుదల కావడంతో వీరంతా ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు . ఒక రూపాయి కట్ ఆఫ్ తో 20 లక్షల మంది రైతుల రుణమాఫీ జరగలేదు . ఈ 20 లక్షల మందికి రుణమాఫీ కోసం రూ.11,445.95 కోట్లు అవసరం అంటే మొత్తం రుణమాఫీలో సగం కంటే తక్కువ మందికే రుణమాఫీ జరిగింది మిగిలిన రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.

PM కిసాన్ పథకం 15వ విడతను పొందాలనుకుంటే ఈ పనులు చేయండి..

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine

More on News

More