ఎరువు మరింత బరువు...
సాగు పెరిగిందని సంబరపడుతున్న రైతన్నకు ...ఎరువుల ధరలు పెరిగాయన్న పిడుగులాంటి వార్త, వ్యవసాయంలో పెట్టుబడిని మరింత భారంగా మార్చింది. ఖరీప్ ప్రారంభానికి ముందే ఎరువులు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఎరువుల ధరలు 58 శాతం పెరగనున్నాయి. ముడిసరుకులు, పెట్రోల్ ధరల పెరుగుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సాగు, దిగుబడి పెరిగినా పంటకు కనీస మద్ధతు ధర లభించని రైతన్నకు ఈ ఎరువుల ధరల పెంపు నిర్ణయం ఆందోళన కలిగించే అంశమే.
ఏవి పెరిగాయి? ఎంత పెరిగాయి?
పెట్టుబడి భారంతో సతమతవుతున్న రైతన్నకు, ఎరువుల కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి. సుమారు 52 శాతంగా పెరిగిన ధరల పెంపుతో , ఒక్కో ఎరువు బస్తాపై కనీసం రూ.450 పెరగనుంది.
పెరిగన ధరలను ఈ నెలనుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించాయి కంపెనీలు. కొన్ని కంపెనీలు ధరలు ప్రకటించగా, మరికొన్ని కంపెనీలు పెరిగన ధరలు వెల్లడించాల్సి ఉంది.
రైతులు ప్రధానంగా ఉపయోగించి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచాయి.
పాత డీఏపీ ధర పెంపు లేదు : ఇఫ్కో
కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ను పాత ధరల ప్రకారమే విక్రయించనున్నట్లు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) వెల్లడించింది. సుమారు 11.26 లక్షల టన్నుల ఫర్టిలైజర్ ను పాత ధర ప్రకారం విక్రయించనున్నారు. ఎరువుల ధరల పెంపు నిర్ణయం తర్వాత కొత్త ధరలను ప్రకటించిన ఇఫ్కో పాత డీఏపీని పాత ధరకే అమ్ముతున్నట్లు తెలిపింది. పాతధరల ప్రకారం 50 కిలోల డీఏపీ సంచి రూ.1200,ఎన్ పీకే 12:32:16 రూ.1185, ఎన్ పీఎస్ 20:20:0:13 రూ.925 కే విక్రయించనున్నట్లు తెలిపారు. కొత్త ధరలు ప్రకటించినా, అవి ప్రస్తుతానికి రైతులకు విక్రయించడానికి కాదని, పాత నిల్వ పూర్తయిన తర్వాతనే వాటి అమ్మకం ఉంటుందని ఇఫ్కో ఎండీ అవస్థీ ట్వీట్ చేశారు.
https://twitter.com/drusawasthi/status/1380057716379373570
https://telugu.krishijagran.com/news/telangana-sheep-distribution-scheme/
https://telugu.krishijagran.com/news/how-to-grow-costliest-vegetable-hop-shoots/
Share your comments