News

కాలాపట్టీ పై మనసు పెట్టిన రైతులు.. సేంద్రీయ పద్ధతిలో ప్రయోగాత్మక సాగు!

KJ Staff
KJ Staff

ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన
కాలాపట్టి అనే వరి రకాన్ని చాలా మంది రైతులు సేంద్రియ పద్ధతిలో ప్రయోగాత్మకంగా అధిక విస్తీర్ణం సాగు చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. పొలమంతా నల్లగా ఉండే ఈ రకం వరి పూత దశకు వచ్చే సమయంలో పసుపు రంగుకు మారుతుంది. కాలాపట్టి వరి పూత ఎర్ర రంగులో ఉండగా గొలుసు పడే సమయంలో పొలం కూడా ఆకుపచ్చ వనంలా మారనుంది. పంట పూర్తయ్యే సమయానికి ధాన్యం మొత్తం నల్లరంగులోకి మారుతుంది. బియ్యం కూడా నల్లగానే ఉంటాయి.

సాధారణ బియ్యంతో పోలిస్తే కాలాపట్టి వరి బియ్యం నల్లగా ఉండడంతోపాటు ఎన్నో పోషక, ఔషధ విలువలు తాగి ఉండటంతో ప్రస్తుత మార్కెట్లో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.ఇతర వరి రకాలతో పోలిస్తే కాలాపట్టి రకం దిగుబడి కూడా తక్కువగానే ఉంటుంది. ఇతర వరి రకాలు ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండగా ఈ రకం మాత్రం 15 నుంచి 17క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అంతేకాకుండా
ఇతర వరి రకాల కంటే 20 రోజుల పంట సమయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీటికి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కలాపట్టి వరి రకాన్ని రైతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నందున డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో కిలో నల్ల బియ్యం ధర రూ.150 నుంచి రూ. 200ల వరకు పలుకుతున్న డంతో రైతులు సుమారు వంద ఎకరాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని
జక్రాన్‌పల్లి, మాక్లూర్‌, నందిపేట, బాల్కొండ, మెండోరా, కోటగిరి, వర్ని తదితర మండలాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల నేలల్లో వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు అలాగే
కాలాపట్టి వరి రకం సాగులో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. అయితే సాధారణ వరి రకాలతో పోలిస్తే ఈ రకం తక్కువ దిగుబడినిస్తుంది.అయినప్పటికీ ఈ నల్ల బియ్యానికి ప్రస్తుత మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో రైతులు కాలాపట్టి వరిసాగుకు ఆసక్తి కనబరుస్తు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More