రైతు పంట రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిన్న ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు అండగా ఉండాలని 1 ఏప్రిల్, 2014 నుండి 11 డిసెంబర్, 2018 వరకు మంజూరు చేయబడిన/రెన్వాల్ చేయబడిన పంట రుణాలు రుణమాఫీకి అర్హమని ఆయన తెలిపారు.
11 డిసెంబర్, 2018 నాటికి బకాయి మొత్తం పరిగణిస్తారని, ఒక కుటుంబానికి ఒక లక్ష వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు. జిల్లాలోని 3 లక్షల 41 వేల 23 మంది రైతులకు ఈ పంట రుణమాఫీ అందుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మొదటి విడత క్రింద రూ. 25 వేల రుణం వరకు 20891 మంది రైతులకు రూ. 26.759 కోట్లు, రెండో విడత క్రింద రూ. 25 వేల నుండి రూ. 50 వేల మధ్య గల 19443 మంది రైతులకు రూ. 66.43 కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. మూడో విడత క్రింద రూ. లక్షా పది వేల వరకు రుణం ఉన్న 53222 మంది రైతులకు రూ 297.251 కోట్లు అందించినట్లు మంత్రి అన్నారు.
ఇంకా డైరెక్ట్ బినిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా డబ్బులు అందని 582 గుర్తించినట్లు వీరికి కూడావీరి జాబితాను తీసుకొని సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు.
రుణమాఫి అందని రైతులు 1.6 లక్షలు ..
ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత, జిల్లా సహకార అధికారిణి విజయ కుమారి, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, బ్యాంకింగ్ కంట్రోలర్లు, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share your comments