కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతి ఏటా ఆరు వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు 8 విడుదలగా డబ్బులను వారి ఖాతాలో జమ చేసింది.అయితే ఈ డబ్బులు మన ఖాతాలో జమ అయ్యా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి మనకు ఒక యాప్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ద్వారా మనం మన ఖాతాలో డబ్బులు ఎప్పుడు ఎంత జమ అయ్యాయి అనే విషయాలతోపాటు మరిన్ని విషయాలను కూడా తెలుసుకోవచ్చు... మరి ఈ యాప్ ఏ విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం...
కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ -NIC పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ ను సుమారుగా 50 లక్షలకు పైగా రైతులు డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. ఈ యాప్ ద్వారా రైతులు పి ఎం కిసాన్ పథకానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ పథకం ద్వారా లబ్ధిదారుల పేర్లను కూడా ఈ యాప్ ద్వారా మనం చూడవచ్చు.
పిఎం కిసాన్ యాప్ ద్వారా ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా రైతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అదే విధంగా తమ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ పీఎం కిసాన్ యాప్ ద్వారా రైతులు తమ ఇన్స్టాల్మెంట్ వివరాలను తెలుసుకోవచ్చు.మన ఆధార్ కార్డులో పేరు ఉన్నట్టుగానే ఇందులో మన పేరును సవరణ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి లేదా మీ వివరాల గురించి ఏదైనా సందేహాలు ఉంటే తక్షణమే
హెల్ప్ లైన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ సందేహాలను తీర్చుకోవడానికి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఈ యాప్ ద్వారానే రైతులకు అందుబాటులో ఉంచారు.
Share your comments