మిర్చి పంటను వేయాలంటేనే భయపడేవిదంగా తెగుళ్ళ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తెలంగాణ లో గత ఏడాది ఖమ్మంలో 35 వేలు పలికి రికార్డు సృష్టించగా ఈసారి దేశీయ రకం మిర్చి ఏకంగా రూ . 81 ,000 ధర పలికింది , అయితే ఇప్పుడు రైతులను నాణ్యత పేరుతో ధరలను తగ్గిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు .
సోమవారం వరంగల్ ఇనుమల తేజ రకం క్వింటాకు గరిష్టంగా రూ.23,200లు కనిష్టంగా రూ.16500లు, యూఎస్-341 గరిష్టంగా రూ.22,200లు కనిష్టంగా రూ.17,000లు, దేశీరకం రూ.80వేల నుంచి రూ.50 వేలు ధరలు పలికాయి. అదే మంగళవారం తేజ రూ.22,700-17,000లు, యూఎస్-341 రూ.21,300-16,500, దేశీరకం రూ.76 వేల నుంచి రూ.65 వేలు పలకడంతో ఒకే రోజులో రూ.4 వేలు తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయంగా భారీగా డిమాండ్ ఉన్న నాణ్యత పేరుతో రైతులను మోసం చేస్తున్నారు దళారులు , మరోవైపు ధరలు అధికంగా ఉన్నాయని ఒకేసారి రైతులు పంటను మార్కెట్టుకు తీసుకురావడంతో మార్కెట్టుకు మిర్చి రాక ఒకేసారి పెరిగింది దీనిని అదునుగా భావించి ఒకేసారి ధరలను తగ్గించేస్తున్నారు దళారులు .
ఈ ఏడాది తేజ రకం మిర్చికి రికార్డు ధర ..ఎంతనో తెలుసా !
ఈసారి వర్షాలకు తోడు నల్లనల్లి, తామరపురుగు దాడితో మిర్చి పంట దెబ్బ తిని దిగుబడి తగ్గింది. అయిన అధిక ధర లభిస్తుంది అని ఆశించిన రైతులకు మాత్రం నిరాశ ఎదురైనది .
Share your comments