News

కొత్త రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

Gokavarapu siva
Gokavarapu siva

రేషన్‌కార్డుల జారీకి సంబంధించి సామాజిక మాధ్యమాలు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొనసాగుతున్న ప్రచారాలలో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించినట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.

అయితే, ప్రజలు అయోమయానికి గురికావొద్దని మంత్రి గంగూల కమలాకర్ తెలిపారు. ఈ ప్రకటనలను ఎవరు ప్రచారం చేయొద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రేషన్‌కార్డుల జారీ చేయడం లేదని తెలుపుతూ ఈ అసత్య ప్రచారంపై ఆయన ప్రత్యేకంగా హెచ్చరించారు. ప్రభుత్వం తరపు నుంచి కచ్చితంగా ప్రకటన ఇస్తామని, ప్రస్తుతం ఎలాంటి రేషన్ కార్డులు జారీ చేయడం లేదని మంత్రి అన్నారు.

ఇది కూడా చదవండి..

కౌలు రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మంజూరు..

వచ్చే వారం ప్రారంభం కానున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కొనసాగుతున్న ప్రచారం గత కొన్ని రోజులుగా ఊపందుకుంది. దీంతో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డు కోసం మీసేవా కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రచారంలో ఉన్న పుకార్లు, తప్పుడు సమాచారంపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ సందేహాలను తీర్చి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రజలు చూసే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి..

కౌలు రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మంజూరు..

Related Topics

NEW RATION CARDS fake news

Share your comments

Subscribe Magazine

More on News

More