కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదట ప్రయోగాత్మకంగా వ్యవసాయ విద్యుత్తు నగదు బదిలీ పథకాన్ని గత ఏడాది డిసెంబరు నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలోని 31,526 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేయడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
తాజాగా వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుమారు 18 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు ప్రక్రియను విద్యుత్ డిస్కంలు చేపట్టాయి. ఇప్పటికే విద్యుత్ శాఖ కొన్ని జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుకు రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటోంది.కొన్ని చోట్ల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా రైతుల హక్కు పత్రాలు, ఆధార్ కార్డులను సేకరిస్తోంది.
ఇప్పటికే సుమారు 80 శాతం మంది రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంది. ఇందుకు సంబంధించిన మీటర్ల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఈ పథకంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం రైౖతుల్లో అవగాహన కల్పించటానికి రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ను ఉచితంగా పొందుతున్న రైతులందరికీ పథకం వర్తిస్తుంది.
ప్రభుత్వ రైతులపై ఒక్క రూపాయి భారాన్ని కూడా పడనియబోమని ప్రభుత్వమే మొత్తం విద్యుత్ ఛార్జీలను భరిస్తుందని భరోసా ఇస్తున్నప్పటికీ చాలా మంది రైతుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. రాబోయే
ప్రభుత్వాలు భవిష్యత్తులో రైతులకిచ్చే అన్ని సబ్సిడీలను ఉపసంహరిస్తాడు కరెంటు బిల్లులు అదనపు భారంగా మారుతాయి కొందరి వాదిస్తున్నారు.
అలాగే రైతులు చెల్లించాల్సిన వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే నేరుగా విద్యుత్ సంస్థలకు చేరుతుంది.అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వం జమ చేసే విద్యుత్ సబ్సిడీని బ్యాంకులు రైతులు ఇది వరకు తీసుకున్న పాత అప్పులకు జమ చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో సందేహాలు కారణంగా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడానికి అంగీకార పత్రాలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు.
Share your comments